Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పెద్ద‌నోట్ల ర‌ద్దుపై పాట‌రాసి, పాడిన‌ న‌టుడు శింబు!

  • గతేడాది న‌వంబ‌రు 8న పాత పెద్ద‌నోట్ల రద్దు
  • తమిళ సినీ నటుడు శింబు విమ‌ర్శ‌లు
  • అప్ప‌ట్లో పెద్ద‌నోట్ల ర‌ద్దును స‌మ‌ర్థించిన శింబు
గతేడాది న‌వంబ‌రు 8న ప్ర‌ధాన‌మ‌త్రి న‌రేంద్ర మోదీ పాత పెద్ద‌నోట్లను రద్దు చేసిన‌ సమయంలో ఆ నిర్ణయాన్ని సినీన‌టుడు శింబు స‌మ‌ర్థించిన విష‌యం తెలిసిందే. అదే శింబు ఇప్పుడు రూటు మార్చాడు. మోదీ నిర్ణయాన్ని తప్పుబడుతూ పాట రాసి, పాడాడు. గతంలో ఆయ‌న‌ మహిళలను కించపరుస్తూ కూడా బీప్‌ సాంగ్ పాడి విమ‌ర్శ‌ల‌కు గుర‌య్యాడు. పెద్ద‌నోట్ల ర‌ద్దుపై ఆయ‌న రాసిన పాట వైర‌ల్‌గా మారింది.

థాట్రోమ్‌ థుక్కరోమ్‌ పేరిట ఈ పాట‌ను విడుద‌ల చేశాడు. నోట్ల రద్దు నిర్ణ‌యం, జీఎస్టీ అమ‌లుతో సామాన్య ప్రజలపై మరింత భారం మోపారని ఆయ‌న మండిప‌డ్డాడు. రైతుల క‌ష్టాలు త‌గ్గ‌డం లేద‌ని అన్నాడు. విజయ్‌ మాల్యా లాంటి వారు ఎంచ‌క్కా విమానం ఎక్కి ఎగిరిపోయార‌ని పాట‌లో చెప్పాడు. మీరూ చూడండి...
simbu
demonitization
Narendra Modi

More Telugu News